కామారెడ్డి, జూన్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల పరిధిలోని గోకుల్ తాండకు చెందిన లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు ఆరోగ్యరీత్యా రక్తం అవసరం ఉండటంతో ఫోర్ సైట్ ఎన్జిఓను సంప్రదించారు.
సంస్థ ఫౌండర్ భానోత్ నరేష్ నాయక్, వాలీన్టీర్ అనీల్ ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి ఫోర్ సైట్ ఎన్జీఓ ఆదుకుంటుందని ఫౌండర్ బానోత్ నరేష్ నాయక్ తెలిపారు.