ధరణి దరఖాస్తులను ప్రణాళిక బద్ధంగా పరిష్కరించాలి

కామారెడ్డి, జూన్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక ద్వారా పెండిరగ్‌ ధరణి దరఖాస్తుల పరిష్కారాన్ని తీసుకోవాల్సిన చర్యల పై శుక్రవారం సిసిఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ హైదరాబాద్‌ సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో పెండిరగ్‌ ధరణి సమస్యల పరిష్కారం పై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రివ్యూ నిర్వహించారు.

ప్రస్తుతం పెండిరగ్‌ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మరోసారి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని, తహసిల్దార్‌ స్థాయిలో రెవెన్యూ డివిజన్‌ అధికారి స్థాయిలో అదనపు కలెక్టర్‌ స్థాయిలో కలెక్టర్‌ స్థాయిలో పెండిరగ్లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు.

ధరణి వెబ్‌ సైట్‌ సంబంధించి జి.ఎల్‌.ఎం, టి.ఎం 33 దరఖాస్తులలో డిజిటల్‌ సంతకాల ప్రక్రియ మార్పులు చేస్తున్నామని, కొన్ని సమస్యలు తహసిల్దార్‌ స్థాయిలో మరికొన్ని సమస్యలు రెవెన్యూ డివిజన్‌ అధికారి మరికొన్ని సమస్యలు కలెక్టర్‌ స్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే భూ సంబంధిత సమస్యలను సైతం కలెక్టర్లకు బదిలీ చేయడం జరుగుతుందని వీటిని అత్యంత ప్రాధాన్యతతో సత్వర పరిష్కారం జరిగేలా చూడాలని సిసిఎల్‌ఏ కమిషనర్‌ పేర్కొన్నారు. ప్రతి మండలంలో సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం ఏర్పాటుకు అనువైన భవనం లేదా భూమి కేటాయించి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో పెండిరగ్‌ ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళిక బద్ధంగా పరిష్కరించాలని, సీ.సీ.ఎల్‌.ఏ కమిషనర్‌ సూచనల ప్రకారం వీలైనంత త్వరగా పెండెన్సీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్‌ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా రెవెన్యూ అదనపు చంద్రమోహన్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ అర్‌.డి. ఓలు రంగనాథరావు, ప్రభాకర్‌, రమేష్‌ రాథోడ్‌, అన్ని మండలాల తాసిల్దార్లు , రెవెన్యూ సూపరింటెంట్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 ఆదివారం, నవంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »