కామారెడ్డి, జూన్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ె
రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి పశువులు, చేపల పెంపకం చేపట్టే విధంగా ఐకెపి అధికారులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో చేపలు, పాడి పశువులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు పంపౌండ్ నిర్మించుకొని తక్కువ పెట్టుబడితో చేపలు పెంపకం చేపట్టి అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇంచార్జ్ డిఆర్డిఓ చందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, అధికారులు పాల్గొన్నారు.