నిజామాబాద్, జూన్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నీట్ పరీక్షలపై సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని నిజామాబాద్ జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి సుధాకర్ అన్నారు. సోమవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నీట్ యూజీ పరీక్ష వ్యవహారంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని సిపిఐగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని బీహార్లో 30 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రం విక్రయించారని, కొద్దిమందిని అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయని అన్నారు.
నీట్ పరీక్ష వ్యవహారంలో ఆరోపణలు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ ప్రధాని మోడీ స్పందించకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నీట్ పరీక్ష వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు పి రంజిత్, బి రఘురాం, పి హనుమన్లు, అంజలి, రాధాకుమార్, వంశీ పాల్గొన్నారు.