బాలికల కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఇంటర్‌ విద్యా అధికారి

నిజామాబాద్‌, జూన్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

2023-24 విద్యా సంవత్సరంలో నిజామాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో అత్యుత్తమ ఫలితాలను సాధించడం పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు . వెయ్యి మార్కులకు గానూ అత్యధికంగా రెండవ సంవత్సరంలో 971 మార్కులు బిపీసీ విద్యార్థిని అయేష ఫాతిమా సాధించగా, ఒకేషనల్‌ మొదటి సంవత్సరం కంప్యూటర్‌ సైన్స్‌ లో 500 మార్కులకు గాను 494 మార్క్‌ లు సాధించడం పట్ల జిల్లా ఇంటర్‌ విద్య అధికారి సంతృప్తిని వ్యక్తం చేశారు. బాలికల కళాశాల జిల్లాలో మంచి ఫలితాలు సాధించడం పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.

బాలికల కళాశాలలో గత సంవత్సరం 1100 పై చిలుకు విద్యార్థులతో కళాశాలను ప్రిన్సిపాల్‌ సమర్థవంతంగా నిర్వహించడం పట్ల జిల్లా ఇంటర్‌ విద్యాధికారి అభినందించారు. కళాశాలలో అన్ని సబ్జెక్టులను బోధించడానికి అధ్యాపకులు ఉండడంతో పాటు ప్రయోగశాలలు, లైబ్రరీ, ఫర్నిచర్‌, మంచినీటి వసతి, మరుగుదొడ్లు, అధునాతన భవనాలతో బాలికల కళాశాలలో తరగతుల నిర్వహణ పట్ల జిల్లా ఇంటర్‌ విద్యార్థి అధికారి సంతృప్తి వ్యక్తం చేశారు. పేద, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో కళాశాలలో అడ్మిషన్లు పొంది ప్రభుత్వ ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

అధ్యాపకులు మరింత ఉత్సాహంతో పని చేస్తూ తమ లక్ష్యాన్ని మించి ఫలితాలను సాధించడానికి కృషి చేయాలని ఆదేశించారు. అధ్యాపకుల పని తీరుతో పాటు కళాశాల కార్యాలయ సిబ్బంది, ఫైళ్ళ నిర్వహణ పనితీరును అభినందించారు. సమావేశంలో వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రిన్సిపాల్‌ తో పాటు అధ్యాపకులు కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో పదవ తరగతి పాస్‌ అయి వచ్చిన ప్రతి విద్యార్థినికి అడ్మిషన్‌ ఇవ్వడానికి సిబ్బంది అందుబాటులో ఉంటారని కళాశాల ప్రిన్సిపాల్‌ నుస్రత్‌ జాహాన్‌ తెలిపారు. అధ్యాపకులు, సిబ్బంది తనకు పూర్తి స్థాయి లో సహకరిస్తూ కళాశాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ప్రిన్సిపాల్‌ అన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »