కామారెడ్డి, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సదాశివనగర్ మండలంలో గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, డంప్ యార్డ్, నర్సరీల పనులను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి తగు ఆదేశాలిచ్చారు. మండల కేంద్రంలోని డంప్ యార్డ్ ను సందర్శించి సేగ్రిగేషన్ వల్ల వస్తున్న ఆదాయం తక్కువగా ఉన్నదని, డ్రై వేస్ట్ ఇంకా బాగా జరిపి ఆదాయం పెంపొందించుకోవాలన్నారు.
ధర్మారావు పేటలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టిన పనుల పురోగతిని పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. నర్సరీని సందర్శించి ఇంకా మెరుగుపరచాలని, మొక్కల బ్లాక్‌లు క్రమపద్ధతిలో పెట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కల్వరాల హై స్కూల్‌లో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తయినట్లు చెప్పారు. ఎంపిపిఎస్ పాఠశాలలో 50 శాతం మేరకు పనులు పూర్తయినట్లు గుర్తించారు. త్వరగా పనులు పూర్తి చేసి, ఎంబి రికార్డు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ కింద ఇంటింటా నీటి కుళాయి సర్వే పనులు ఎంతవరకు వచ్చాయి.
ఎలా చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శిని అడుగగా డోర్ లాక్ ఉన్నవి. పెండిరగ్ ఉన్నాయని త్వరలో సర్వే పూర్తి చేస్తామని పంచాయతీ కార్యదర్శి కలెక్టర్‌కు వివరించారు. క్షేత్ర స్థాయిలో పనుల పురోగతిని మళ్లీ పరిశీలిస్తానని అధికారులు ప్రగతిలో ఉన్న పనులు శరవేగంతో పూర్తి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో తరగతుల బోధన తీరును పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు. విద్యార్థులు కలెక్టర్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలలో మొక్కలు నాటారు.
కార్యక్రమంలో తహసీల్ధార్ గంగాప్రసాద్, ఎంపిడిఓ సంతోష్ కుమార్, ఎంపిఓ సురేందర్ రెడ్డి, ఎంఈఓ యూసుఫ్, మిషన్ భగీరథ డీఈ,ఏ ఈ, పంచాయత్ రాజ్ అధికారులు పాల్గొన్నారు.