ఆర్మూర్, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ పట్టణంలోని కమలాకర్ నెహ్రూ కాలనీలో దండోరా రజ తోత్సవ కరపత్రాలను ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ అవార్డు గ్రహీత మోతే భూమన్నతో పాటు ఆర్మూర్ నియోజకవర్గం ఇంచార్జ్ దేవన్న సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ ఆధ్వర్యంలో మాదిగ, మాదిగ ఉప కులాల ప్రజలు హైదరాబాదులో నిర్వహించే దండోరా రజతోత్సవాలకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
దండోరా రజతోత్సవాలకు ఎంపీలు ఎమ్మెల్యేలు పలువురు ముఖ్య నాయకులు హాజరవుతున్నారు కాబట్టి ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కందుల రాములు, ఎల్లయ్య, ప్రభాకర్, మార్క్ రక్షణ జాన్ తదితరులు పాల్గొన్నారు.