నిజామాబాద్, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
2024- 25 సం. నకు గాను షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా న్యాయశాస్త్ర పట్టభదుల నుండి న్యాయ పరిపాలనలో ఉచిత శిక్షణ పొందుటకు గాను అభ్యర్తుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు ఈ కింది విధముగా అర్హతను కలిగి ఉండాలి.
- షెడ్యూల్డ్ కులములకు చెందిన ఉమ్మడి జిల్లా (నిజామాబాద్ మరియు కామారెడ్డి) అభ్యర్తులకు సీట్లు మంజూరైనవి.
- అభ్యర్తులు బార్ కౌన్సిల్ లో రిజిష్టర్ అయి ఉండవలెను.
- అభ్యర్తి యొక్క తండి/సంరక్షకుని సంవత్సర ఆదాయము రూ. 2,00.000 లకు మించరాదు.
- శిక్షణ (3) సం.ల కాలంలో అభ్యర్తికి నెలకు రూ.3000 చొప్పున స్టైపెండ్ చెల్లించబడును. నమోదు రుసుమును రీఇంబర్స్మెంట్ పద్దతిన చెల్లించును మరియు రూ.50000 కావలసిన పుస్తకములు మరియు ఫర్నీచర్ కొనుగోలు చేయుటకు నియమ నిభందనలకు లోబడి చెల్లించబడును.
కావున శిక్షణ పొందగోరు ఆసక్తి గల అభ్యర్తులు తమ దరఖాస్తులను http://telanganaepass.cgg.gov.in ద్వారా ఆన్ లైన్ వెబ్సైట్‌లో నమోదు చేసుకొని అట్టి దరఖాస్తు ఫారములను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయము, ఐడిఓసి, కొత్త కలెక్టరేట్ కార్యాలయము, నిజామాబాద్ వద్ద సమర్పించగలరు.