కామారెడ్డి, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గత 20 సంవత్సరాల పోరాట ఫలితంగా తెలుగు హిందీ ఉర్దూ భాషా పండితుల పోస్టులు అప్గ్రేడ్ అయ్యి పదోన్నతులు పొందిన సందర్భంగా భాషా పండితులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సంబరాలు నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆర్ యు పి పి టి కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన జిల్లా విద్యాశాఖ అధికారి రాజుని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన ఏ సి జి ఈ అధికారి బలరాం కామారెడ్డి ఎంఈఓ ఎల్లయ్యను సన్మానించారు. కామారెడ్డిలో పదోన్నతుల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అహర్నిశలు కృషిచేసిన సిబ్బందికి సంఘం పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్ యు పి పి టి జిల్లా అధ్యక్షులు నార్ల అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రమోషన్ పొందని వారికి కూడా జిల్లాలో పదోన్నతులు కల్పించి తగు న్యాయం చేయాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నార్ల అరుణ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రజాక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గఫూర్ శిక్షక్, రాష్ట్ర కార్యదర్శి మంత్రి మధుసూదన్, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆర్ యు పి పి టి ప్రతినిధులు లాల్ సింగ్, సురేష్, వంశీధర్, బ్రహ్మచారి, లింగం, రమేష్, చైతన్య, హనుమంత్, ప్రసాద్ యాదవ్, చంద్రశేఖర్, రాజయ్య, భాషా పండితులు పాల్గొన్నారు.