కామారెడ్డి, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సోమవారం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఫలితాలలో రాష్ట్రస్థాయిలో వి ఇందువర్ష ఎంపీసీ మొదటి సంవత్సరంలో 470కి 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకును సాధించడం జరిగింది. అలాగే కె.వి పూజ బైపీసీలో 440కి 436 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించడం జరిగింది.
విద్యార్థులను కామారెడ్డి జిల్లా నోడల్ ఆఫీసర్ షేక్ సలాం సన్మానించారు. సలాం మాట్లాడుతూ మున్ముందు మంచి మార్కులు సాధించి మీరు పెట్టుకున్న గోల్స్ ను రీచ్ అవ్వాలని, మీ కలలను సహకారం చేసుకోవడానికి అధ్యాపకుల సలహాలు మీ తల్లిదండ్రుల సహకారం తీసుకోవాలని గుర్తు చేశారు.
అలాగే ఆర్కే గ్రూప్ ఆఫ్ కరస్పాండెంట్ అండ్ సీఈవో డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ కళాశాలకు మరియు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.
కార్యక్రమంలో ఎస్ ఆర్ కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ దత్తాత్రి, ఎస్ ఆర్ కె జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నరేష్ కుమార్, పిజి ప్రిన్సిపాల్ తిరుపతి రెడ్డి, డీన్ అకాడమిక్ నవీన్ కుమార్, అధ్యాపకులు కళాకృష్ణ, అజార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.