కామారెడ్డి, జూన్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి ఎస్పి ఆఫీస్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 276, కామారెడ్డి నియోజకవర్గంలోని 274, జుక్కల్ నియోజకవర్గం లోని 262 మొత్తం 812 వివి ప్యాట్ల నుంచి థర్మల్ పేపర్ రోల్స్, అడ్రస్ ట్యాగుల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు.
అనంతరం ఈవీఎం గోదాంకు తాళం వేసి సీజ్ చేశారు. కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డిఓ రంగనాథరావు, ఎన్నికల విభాగం అధికారులు ప్రేమ్ కుమార్, అనిల్ కుమార్, తాసిల్దార్ జనార్ధన్, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల అధికారులు పాల్గొన్నారు.