నిజామాబాద్, జూన్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ జిల్లాలోని కొన్ని విధ్యార్థి సంఘాలు ఈ మధ్య కాలంలో కొన్ని ప్రైవెట్ స్కూల్స్‌కు మరియు ప్రైవెయిట్ కళాశాలలకు సంబంధించి క్యాంపస్‌లోకి ప్రవేశించి యాజమాన్యాలతో గొడువకు దిగి, భయబ్రాంతులకు గురి చేస్తు వారి విధులను అడ్డుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కావున విధ్యార్థినాయకులకు లేదా విధ్యార్థి సంఘాలకు విధ్యకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్న వారు ముందుస్తుగా జిల్లా విధ్యాశాఖ అధికారుల దృష్టికి లేదా జిల్లా పరిపాలన అధికారి దృష్టికి తీసుకొని వెళ్లాలని, సమస్య పరిష్కారానికి సామరస్యంగా కృషిచేయాలి తప్ప, మీ అంతట మీరు స్కూళ్లకు లేదా కాలేజీలకు వెళ్లి దాడులు నిర్వహించినట్లయిన, బంద్ చేయించిన, యాజమాన్యాలను భయబ్రాంతులకు గురిచేసిన వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు.
ఇట్టి విషయమై మంగళవారం ఆయన జిల్లాలోని అన్ని డివిజన్ స్థాయి అధికారులకు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లకు, ఎస్.హెచ్.ఓలకు, ఎస్.ఐలకు ఆదేశాలు జారీచేశారు.