కామారెడ్డి, జూన్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
టీఎస్ బి పాస్ క్రింద ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి ఉన్న లే అవుట్‌లకు 21 రోజులలోగా అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి లే అవుట్ కమిటీ సమావేశంలో సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిబంధనల మేరకు లే అవుట్‌లు ఉన్నాయా? లేవా అని క్షేత్ర స్థాయిలో స్థాయిలో పరిశీలించి నిర్దారిత సమయంలోగా అనుమతులివ్వాలన్నారు.
కామారెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ లో 2 చొప్పున లే అవుట్ అనుమతులు పెండిరగులో ఉన్నాయని అన్నారు. శుక్రవారం తిరిగి సమావేశమయ్యే నాటికి ప్రభుత్వ నిబంధనలు మేరకు లే అవుట్‌లో అండర్ డ్రైనేజీ, విద్యుత్, సెప్టిక్ ట్యాంక్, ఇంకుడు గుంత, పచ్చదనం, 10 శాతం మార్టిగేజ్ వంటివి పొందుపరిచారా, వాటిని ఏర్పాటు చేస్తున్నారా పరిశీలించాలన్నారు. ప్రధానంగా రెవిన్యూ, నీటిపారుదల, పంచాయతీ రాజ్, రోడ్లు, భవనాలు, మునిసిపాలిటీ, విద్యుత్ శాఖలు తమ పరిధిలో వచ్చే అంశాలను పరిశీలించి వారం రోజులల్లో వివరాలను పొందుపరుస్తూ కలెక్టర్ లాగిన్‌కు పంపాలని, అక్కడ పరిశీలించి తుది లే అవుట్ అనుమతికి మునిసిపల్ కమీషనర్ కు పంపడం జరుగుతుందన్నారు.
సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి ఆర్డీఓ రంగనాథ రావు, మునిసిపల్ కమీషనర్ సుజాత, ఆర్ అండ్ బి ఈఈ రవి శంకర్, జిల్లా నీటిపారుదల అధికారి నరసింహ రావు, విద్యుత్ శాఖ ఎస్ ఈ రమేష్ బాబు, కలెక్టరేట్ పర్యవేక్షకులు జ్యోతి తదితరులు పాల్గొన్నారు,