నిజామాబాద్, జూన్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేటు కార్పోరేట్ పాఠశాల దోపిడిని అరికట్టాలని మంగళవారం పిడిఎస్‌యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశార. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియమించకుండా విద్యార్థుల సంఖ్య ఎలా పెరుగుతుందన్నారు.
అదేవిధంగా జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలకు అనుమతులు లేకుండా, సౌకర్యాలు లేకుండా, క్వాలిఫికేషన్ లేని టీచర్ల విద్యాబోధన చెప్తున్నా జిల్లా అధికారులు నిమ్మకునీరెత్తి నట్లు ఉండడం సిగ్గుచేటన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో పుస్తకాలముతున్న, ఇష్టం వచ్చిన రీతులుగా ఫీజులు వసూలు చేస్తున్నా, జిల్లా అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులను డిస్ప్లే చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అనుమతులు లేని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల పేర్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న ప్రతీ సమస్యను పరిష్కరించి ప్రైవేటు కార్పోరేట్ దోపిడి నియంత్రణకి ముందున్డాల్సిందిగా కోరారు.
జిల్లాలో కిడ్స్ పాఠశాలలు, ప్లే పాఠశాలలు విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. లేనియెడల విద్యార్థి ఉద్రమాలు ఉధృతం అవుతాయని, జరిగే పరిణామాలకు జిల్లా విద్యాధికారులు, ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా హెచ్చరించారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే. అషూర్, జిల్లా సహాయ కార్యదర్శి బి. చందు, జిల్లా కోశాధికారి నిఖిల్, జిల్లా నాయకులు మహిపాల్, మమత, జంపన్న తదితరులు పాల్గొన్నారు.