కామారెడ్డి, జూన్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిటీ న్యూరో వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న కల్పన (28) కు ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో రక్తనిధి కేంద్రాలలో వారికి కావలసిన రక్తం దొరకకపోవడంతో జిల్లా కేంద్రానికి చెందిన పాత అఖిల్ మానవతా దృక్పథంతో ఓ పాజిటివ్ రక్తాన్ని స్వచ్ఛందంగా ముందుకొచ్చి అందజేసి ప్రాణదాతగా నిలిచారని ఐ విఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ ,రెడ్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు అన్నారు.
ప్రతి రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 నుండి 20 మంది వివిధ రక్త నమూనాల గ్రూపులు అవసరం ఉన్నాయని సంప్రదించడం జరుగుతుందని, ఆపదలో ఉన్నవారికి అందరికీ సకాలంలో రక్తాన్ని అందజేయాలంటే రక్తదానానికి ముందుకు రావాలన్నారు.
రక్తదానం చేయాలనుకున్నవారు వారి యొక్క పేరు వారి పేరు,బ్లడ్ గ్రూప్ వివరాలను 9492874006 నెంబర్ కి తెలియజేయాలన్నారు. రక్తదానం చేసిన రక్తదాతకు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్నల తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎర్రం ఈశ్వర్ టెక్నీషియన్లు జీవన్, వెంకటేష్ పాల్గొన్నారు.