డిచ్‌పల్లి, జూన్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి ఆదేశాల మేరకు ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సహజ యోగ మెడిటేషన్ కార్యక్రమం నిర్వహించారు.
పూణే కేంద్రానికి సంబంధించిన మాతాజీ నిర్మలాదేవి సహజ యోగ గురువు పూజ్యశ్రీ కరణ్ సంబంధించిన ఆధ్వర్యంలో కామర్స్ అండ్ బిజినెస్ మెంట్ సెమినార్ హాల్ లో యోగా ప్రయోజనాలు, పాటించాల్సిన విధానాల గురించి వివరించారు.
ఆహారంతోనే ఆరోగ్యం కాపాడుకోవాలని ఆహారమే ఔషధంగా మార్చుకోవాలని అందుకు ప్రకృతిలో లభ్యమయ్యే పచ్చి ఆహారం, మొలుకలు తీసుకోవాలని మాంసాహారానికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు.
కార్యక్రమానికి అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ ఆరతి మాట్లాడుతూ మంచి ఆలోచనలతో ఒత్తిడిని తగ్గించుకోవాలని ఒత్తిడికి దూరంగా ఉండటమే నిజమైన ఆరోగ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితోపాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.