కామారెడ్డి, జూన్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడంలో జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మందంజలో ఉండటం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం 10వ తరగతిలో 10/10 జీపీఏ సాధించిన పదిమంది విద్యార్థులకు నగదు ప్రోత్సాకాలను పంపిణీ చేశారు.
కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథి హాజరై మాట్లాడారు. ఒక్కొక్కరికి 5 వేల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాకాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీపడి చదివి ఉత్తమ ప్రతిభ కనబరచాలనే ఉద్దేశంతో ఐదేళ్ల క్రితం విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నగదు పురస్కారాలు అందజేస్తున్నారని చెప్పారు. విశ్రాంత ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆరోగ్య శిబిరాలు, నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సామాజిక సేవలు చేస్తున్నారని పేర్కొన్నారు.
విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత రంగాల్లో రాణించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నిట్టు విట్టల్ రావు, కార్యదర్శి బి.గంగా గౌడ్, కోశాధికారి మల్లేశం, ప్రతినిధులు ఉపేందర్, సలావుద్దీన్ పాల్గొన్నారు.