కామారెడ్డి, జూన్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి పట్టణం పరిధిలోని రామేశ్వర్ పల్లి ఎనిమల్ కేర్ సెంటర్ ను శనివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. 182 కుక్కలకు పిల్లలు పుట్టకుండా శస్త్ర చికిత్సలు చేసినట్లు జిల్లా పశు వైద్యాధికారి సింహా రావు కలెక్టర్కు తెలిపారు.
గ్రామాల్లో కుక్కల సంతతి పెంచకుండా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు చెప్పారు. ఎనిమల్ కేర్ సెంటర్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ ఇందూ ప్రియ, కమిషనర్ సుజాత, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.