డిచ్‌పల్లి, జూన్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో న్యూ క్రిమినల్ లాస్ పై వర్క్ షాప్ నిర్వహించారు. కార్యశాలకు డా. కె. ప్రసన్న రాణి న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షత వహించగా ప్రధాన వక్తగా హాజరైన కంక కనకదుర్గ ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ మరియు సెషన్ జడ్జ్ నిజామాబాద్ ప్రసంగిస్తూ న్యూ క్రిమినల్ లాస్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
మూడు క్రిమినల్ లాస్ పై సుదీర్ఘ చర్చ చేశారు. మూడు చట్టాలలో మొదటిది భారతీయ న్యాయ సంహిత, రెండవది భారతీయ నాగరిక సురక్ష సంహిత, మూడవది భారతీయ సాక్ష్య సంహిత మీద విస్తృత సంపూర్ణమైన అవగాహన కల్పించారు.
కార్యశాలలో ఆర్ఎస్ శ్రవణ్ కుమార్ అడ్వకేట్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూతన క్రిమినల్ లాస్ లో ఉన్న వివిధ కొత్త సెక్షన్లను ఎదురయ్యే సవాళ్లను వివరించారు. కార్యక్రమంలో డా. బి. స్రవంతి, డా. బి. నాగజ్యోతి విద్యార్థులు పాల్గొన్నారు.