మానవత్వాన్ని చాటిన రక్తదాత

కామారెడ్డి, జూలై 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన నర్సింలు (48) బిజెపి నాయకుడు కిడ్నీ వ్యాధితో డయాలసిస్‌ నిమిత్తమై అత్యవసరంగా నిమ్స్‌ వైద్యశాల హైదరాబాదులో ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. కాగా హైదరాబాద్‌ కి ముర్కి వంశీ కృష్ణకు తెలియజేయడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి 7వ సారి రక్తదానం చేశారు.

రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత వంశీ కృష్ణకు ఐవీఎఫ్‌ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. గతంలో కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తం అవసరమని తెలియజేయగానే స్పందించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »