కామారెడ్డి, జూలై 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అన్ని తరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78 వ వర్థంతి సందర్బంగా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, తెలంగాణ సమాజం వెట్టిచాకిరి నుండి విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రైతాంగ సాయుద్ధ పోరాటంలో తొలి అమరుడుగా నిలిచారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని యువత సమాజ హితం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్, జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి రజిత, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.