నిజామాబాద్, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వాతావరణ మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రభలె అవకాశం ఉన్నందున,సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కీటక జనిత వ్యాధుల నియంత్రణ కోసం సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, …
Read More »Daily Archives: July 8, 2024
వనమహోత్సవం విజయవంతం చేయాలి…
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమాన్ని జిల్లా మొత్తం విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆయా జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్‌లో ఆయా జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లా మొత్తం 17 లక్షల 88 వేల మొక్కలను …
Read More »ఘనంగా వైయస్ జయంతి వేడుకలు
బాన్సువాడ, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కాకుండా కేంద్రంలో అధికారంలోకి …
Read More »ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి రక్తం అందజేత…
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన అమృతమ్మ (77) కు కాలు ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్త నిల్వలు రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించారు. గ్రామానికి చెందిన భూంపల్లి …
Read More »ప్రజావాణికి 105 ఫిర్యాదులు
నిజామాబాద్, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర …
Read More »కామారెడ్డి కలెక్టర్ కీలక ఆదేశాలు
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. వివిధ మండలాలల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశమందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల ద్వారా స్వీకరించారు. ప్రధానంగా విద్య,వైద్య, బిసి,గిరిజన సంక్షేమం, విద్యుత్, పంచాయతీ, పింఛన్లు, ఆపద్బాందు, మున్సిపాలిటీ, ధరణి, మైన్స్, డబుల్ బెడ్ …
Read More »