ఆపరేషన్‌ నిమిత్తమై వృద్ధురాలికి రక్తం అందజేత…

కామారెడ్డి, జూలై 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన అమృతమ్మ (77) కు కాలు ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్త నిల్వలు రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు ను సంప్రదించారు.

గ్రామానికి చెందిన భూంపల్లి తిప్పర్తి బాలకృష్ణకు తెలియజేయగానే వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో ఓ పాజిటివ్‌ రక్తాన్ని అందజేయడం జరిగిందన్నారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత బాలకృష్ణకు ఐవిఎఫ్‌ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, రెడ్‌ క్రాస్‌ జిల్లా చైర్మన్‌ రాజన్నల తరఫున అభినందలు తెలిపారు. రక్తదానం చేయాలనుకున్న వారి యొక్క వివరాలను 9492874006 నెంబర్‌ కి సంప్రదించాలన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »