బాన్సువాడ, జూలై 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కాకుండా కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారన్నారు.
పేద ప్రజల సంక్షేమం కోసం ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రియంబర్స్మెంట్,అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి పేదవారికి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కాలేక్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు అంజి రెడ్డి, అజీమ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ గుప్తా, కౌన్సిలర్లు కాసుల రోహిత్, నార్ల నందకిషోర్ గుప్తా, మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, సాహెబ్,రహీస్, మొహిన్, నార్ల ఉదయ్, శ్రీనివాస్ రెడ్డి, నబి, సాయిలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.