డా. కొప్పుల విజయ్ కుమార్
ఎడపల్లి, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది సామాజిక న్యాయం కోసం నెల్సన్ మండేలా స్థాపించారని దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు నేషనల్ ఛైర్మన్ డా . కొప్పుల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సమాజంలో సమస్యలపై పోరాటం చేస్తామని సౌత్ ఇండియా ఛైర్మన్ డా. గంప హన్మగౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ నేషనల్ ఛైర్మన్ డా.కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఎడపల్లి మండల ఛైర్మన్ గా మంగల్పాటి లింగంను నియమించారు.
ఈ సందర్భంగా సౌత్ ఇండియా ఛైర్మన్ డా.గంప హన్మ గౌడ్, స్టేట్ డైరెక్టర్ మాలెపు నారాయణ చేతుల మీదుగామంగల్పాటి లింగంకు నియమాక పత్రం, గుర్తింపుకార్డు అందజేశారు. ఈ సందర్భంగా హన్మగౌడ్ మాట్లాడుతూ… జూలై 1వ తేది నుంచి అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని, సమాజంలో జరిగే కులబహిష్కరణ, బాలకార్మికుల నిర్ములన, బ్రూణ హత్యలు, భూకబ్జాలు వంటివి నిర్మూలించడానికి వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పనిచేస్తుందని అన్నారు.
రాజ్యాంగ విరుద్ధంగా జరిగే పనులు, సామాజిక అన్యాయం జరిగేచోట ప్రశ్నిచేందుకు ఈ సంస్థ పనిచేస్తుందని అన్నారు. అనంతరం ఎడపల్లి మండల అధ్యక్షుడు మంగల్పాటి లింగం మాట్లాడుతూ.. ఎలాంటి ఆపేక్ష లేకుండా తనకు ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తానని, సామాజిక సమస్యలపై పోరాడుతానని అన్నారు.
కార్యక్రమంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ డైరెక్టర్ మాలెపు నారాయణ, సాయిలు, బోధన్ నియోజకవర్గ ఛైర్మన్ సుభాష్, జిల్లా ప్రెసిడెంట్ రాజేందర్, జిల్లా సెక్రటరీ ప్రసాద్, జీవన్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.