బాన్సువాడ, సెప్టెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ తాండ గ్రామపంచాయతీ పరిధిలోని కన్నయ్య తండాకు చెందిన గిరిజన యువకుడు జైపాల్ జావలిన్ త్రో క్రీడల్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో క్రీడా అభిమానులు తండావాసులు యువకున్ని అభినందించారు.
పేదింటి కుటుంబానికి చెందిన జైపాల్ యొక్క తండ్రి హస్రత్ గత రెండు సంవత్సరాల క్రితం విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. తల్లి వ్యవసాయ పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. క్రీడాకారుడు జైపాల్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తూ క్రీడల పట్ల తన ఆసక్తిని కనబరచి జావలిన్ త్రో క్రీడల్లో నైపుణ్యాన్ని కనబరిచినందుకు జాతీయ స్థాయికి ఎంపికై ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో అక్టోబర్ నెలలో జరగనున్న క్రీడల్లో జైపాల్ తన క్రీడా నైపుణ్యాన్ని కనపరచనున్నారు.
క్రీడాకారుడు జైపాల్ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని క్రీడాకారుడు జగ్రాం రాథోడ్ ఆకాంక్షించారు.