నందిపేట్, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో ప్రభుత్వ పాలిటెక్నిక్, నందిపేట జాతీయ సేవా పథకం విద్యార్థులు కేంద్ర ప్రభుత్వంచే జారీ చేయబడిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఇందులో భాగంగా ప్రోగ్రాం ఆఫీసర్ లక్ష్మణ్ శాస్త్రి, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలు, ప్లాస్టిక్ నివారణ పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
ప్లాస్టిక్ వాడకం వల్ల, ప్లాస్టిక్ కాల్చడం వల్ల వచ్చే వ్యాధులను గురించి వాలంటీర్లు ఇంటింటి ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించారు. ఆరు రోజులలో గ్రామంలో 115 కిలోల ప్లాస్టిక్ అనర్థాన్ని సేకరించారు. గ్రామంలోని ఉమ్మేడ బ్రిడ్జ్, ఉమామహేశ్వర దేవాలయం మరియు గోదావరి నదిలో నిమజ్జనం తర్వాత ఉన్న ప్లాస్టిక్ చెత్తను తొలగించారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిందిగా కళాశాల ప్రిన్సిపాల్, చైర్మన్ ఎస్. రాజ్ కుమార్ సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె. రవీందర్ రెడ్డి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.