కామారెడ్డి, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన కలకుంట్ల రాజేశ్వరరావు (67) అనీమియా వ్యాధితో గాంధీ వైద్యశాల హైదరాబాదులో చికిత్స పొందుతున్నడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరమని డాక్టర్లు సూచించడంతో వారికి కావలసిన రక్తం దొరకకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో వారికి కావలసిన రెండు యూనిట్ల ఏ పాజిటివ్ రక్తాన్ని సకాలంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అందజేయడం జరిగిందని అన్నారు.
రక్తం దొరకక చాలామంది ఇబ్బందులు పడుతుంటారని అలాంటి వారికి సకాలంలో రక్తాన్ని అందజేయాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉందని రక్తదానం చేయడం వలన తోటి వారి ప్రాణాలను కాపాడమే కాకుండా క్యాన్సర్ గుండె జబ్బు వంటి వ్యాధులు రాకుండా రక్తదాతలకు ఉండడం జరుగుతుందన్నారు. సకాలంలో రక్తాన్ని అందించినందుకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.