బాన్సువాడ, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని మిషన్ భగీరథ కార్యాలయంలో సోమవారం గ్రామ మంచినీటి సహాయకులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి హాజరై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు అందిస్తున్న తాగునీటి పట్ల అశ్రద్ధ వహించరాదని, పైప్ లైన్ లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి లీకేజీ ఉన్నచోట వెంటనే మరమ్మత్తులు చేసి మంచినీటిని సరఫరా అందించేటట్లు చూడాలన్నారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారులు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు.