కామారెడ్డి, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
స్వచ్చత సేవా పక్షోత్సవాలలో విస్తృతంగా పాల్గొని పరిసరాలు పరిశుభ్రత, మొక్కల నాటి సంరక్షించడం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున రాజంపేట మండల కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్చత సేవా హీ కార్యక్రమం క్రింద పల్లె ప్రకృతి వనం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కస్తూర్బా బాలికల విద్యాలయం.లలో కలెక్టర్ మొక్కలు నాటారు.
స్వచ్చత సేవా కార్యక్రమంలో భాగంగా కే.జి.బి.వి. లో విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ తిలకించి విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేసారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే అన్నారు. విద్యార్థులకు లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆ దిశగా చదువు సాగించాలని సూచించారు.
విద్యార్థులకు క్యారియర్ గైడెన్స్ ఒరిఎంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అనంతరం కిచెన్ గదులను తనిఖీ చేశారు. అనంతరం కే.జి.బి.వి. ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఓ. పి. సేవలు విస్తృత పరచాలని అన్నారు. రోగులతో ముచ్చటిస్తూ ప్రాథమిక కేంద్రంలో అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్ర పరచాలని మండల అభివృద్ధి అధికారిని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రుల్లో మొక్కలను నాటారు. ఆసుపత్రిలో పండ్ల మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు.
అనంతరం రాజంపేట తహసిల్ కార్యాలయాన్ని సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలు, ధరణీ వివరాలు, మండలంలోని విస్తీర్ణం వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలోని రికార్డు గదులను పరిశీలించి, పాత రికార్డుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమాలలో ఆర్డీఓ రంగనాథ్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. పద్మ, డిప్యూటీ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. చంద్ర శేఖర్, తహసీల్దార్ అనిల్ కుమార్, మండల విద్య అధికారి రామ స్వామి, కే.జి.బి.వి. అధ్యాపకులు, విద్యార్థులు, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.