కామారెడ్డి, సెప్టెంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
2023 సంవత్సరం దేవన్ పల్లి పోలీసు స్టేషన్ కు సంబంధించిన బాలికపై లైంగిక దాడి పోక్సో చట్టం కేసులో నిందితుడు అయిన మరిపల్లి బాలకృష్ణ ఏ బాలరాజ్ , 40 సంవత్సరాల గల వ్యక్తికి కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్, జీవిత ఖైది శిక్ష మరియు 10 వేల జరిమానా విధించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
రామేశ్వరపల్లి గ్రామం కామారెడ్డి మండలానికి చెందిన మైనర్ బాలిక తేది 2023 మార్చ్ 08 సాయత్రం సమయములో ఇంటి బయట అడుకుంటున్న చిన్నారిని అదే గ్రామానికి చెందిన బాలకృష్ణ ఏ బాలరాజ్, 40 సంవత్సరాలు మైనర్ బాలికతో చాక్‌లెట్స్ మరియు బిస్ కిట్స్ కొనిస్తానని చెప్పి టి వి యస్ ఎక్సెల్ సూపర్ వాహణముపై ఊరు బయట నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి మైనర్ బాలికకి కల్లు త్రాగిపించి బలాత్కారం చేశాడు.
చీకటి పడుతున్న సమయములో గ్రామ శివాలయం వద్ద వదిలి వెళ్ళిపోయాడు. మైనర్ బాలిక తండ్రి ఆమె గురించి వెతుకగా దేవాలయం దగ్గర అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తీసుక వెళ్ళి చికిత్స చేపించగ మరునాడు స్పృహలోకి వచ్చి జరిగిన విషయము తెలుపడముతో మైనర్ బాలిక తండ్రి పిర్యాదు మేరకు దేవన్‌పల్లి పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చేసి పరిశోదన ప్రారంభించారు.
ఇట్టి కేసులో సాక్షులను విచారించి, బలమైన ఆధారాలు సేకరించి నేరస్తుడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయడం జరిగింది. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికను పరిశీలించిన గౌరవ న్యాయ మూర్తి కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ నిందితుడిపై మోపిన నేరం రుజువు అయిందని జీవిత ఖైది శిక్ష మరియు 10 వేల జరిమానా విధించడం జరిగింది. అదేవిధముగా మైనర్ బాలిక బావిష్యత్ అవసరాల నిమిత్తం జిల్లా న్యాయ సేవ సంస్థ ద్వారా 7 లక్షలు అందజేయాలని సూచించారు.
కేసును సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి డియస్పి వి. సురేష్, ఎస్‌ఐ ప్రసాద్, కోర్టు నందు పోలీసు తరపున వాదనలు వినిపించిన అదనపు ప్రాసిక్యూటర్ కె. శేషు, కోర్టులో సాక్షులను సరియగు సమయములో ప్రవేశపెట్టిన ప్రస్తుత డియస్పి నాగేశ్వర్ రావ్, సిఐ యస్. రామన్, ప్రస్తుత ఎస్‌ఐ జి. రాజు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్‌ఐ టి. మురళి, కోర్ట్ కానిస్టేబుల్ బాలకృష్ణ మరియు దేవిచంద్‌లను జిల్లా ఎస్పీ అభినందించారు.