కామారెడ్డి, సెప్టెంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అర్హత కలిగిన కొత్త ఓటర్లను నమోదు చేసుకునే విధంగా సహకరించాలని, బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం రోజున వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హత కలిగిన కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేయాలని సూచించారు.
బూత్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకునే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని అన్నారు. వచ్చే అక్టోబర్ 29 న ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ రోల్ ప్రచురించడం జరుగుతుందని, అట్టి డ్రాఫ్ట్ రోల్ లో అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉన్నట్లయితే నవంబర్ 9, 10 తేదీలలో స్పెషల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అట్టి దానిలో తెలియపరచవచ్చని, ప్రతీ బూత్ స్థాయి అధికారికి తెలియపరచి వచ్చ ని తెలిపారు.
ఫైనల్ పబ్లికేషన్స్ జనవరి 6, 2025 న ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు ఇంటింటి సర్వే కామారెడ్డి లో 97.52 శాతం, జుక్కల్ లో 98.02 శాతం, ఎల్లారెడ్డి లో 99.24 శాతం చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సరళ, తదితరులు పాల్గొన్నారు.