కామారెడ్డి, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జీవదాన్ స్కూల్‌లో చదువుతున్న 6 సంవత్సరాల చిన్నారిపై అదే స్కూల్‌కి చెందిన పీఈటి టీచర్ ఈనెల 21న అసభ్యంగా ప్రవర్తించినాడని సోమవారం 23వతేదీ ఫిర్యాదు చేయగా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద పీఈటిపై రేప్ కేసు నమోదు చేయడం జరిగిందని, అదేవిధముగా నేరస్తుడిని పై చట్టాల క్రింద కస్టడి లోకి తీసుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు.
స్కూల్ యాజమాన్యం వారు ఏదైనా విషయాలు ఉద్దేశ పూర్వకముగా దాచిపెట్టిన నిర్లక్ష దొరనితో వ్యవహరిస్తే విచారించి వారిపై చర్యలు తిసుకోబడతాయన్నారు. కేసు విచారణలో ఉన్న సమయంలో కొంత మంది విద్యార్థుల తల్లితండ్రులు, విద్యార్థి సంఘాలు, స్థానికులు, మరికొందరితో కలిసి నేరస్తుడిపై, స్కూల్ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని తెలుపుతూ నిరసనలు తెలుపుతున్న సమయములో కొందరు వ్యక్తులు జీవదాన్ స్కూల్ అద్దాలను, మిగితా ప్రాపర్టీ లను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేయగా కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. చంద్రశేకర్ రెడ్డి తలకు మరికొందరు పోలీసు అధికారులకు గాయలు అయ్యాయి.
సంఘటన ప్రదేశములో ఉన్న పోలీసు అధికారులు మరియు జిల్లా యస్ పి సింధు శర్మ, విద్యార్థుల కుటుంభ సబ్యులతో, కమ్యూనిటి పెద్దలతో మాట్లాడి నేరస్తుడైన పిఇటి నాగరాజును అరెస్ట్ చేయడం జరిగినదని, శిక్ష పడే విధముగా అన్ని చర్యలు తీసుకుంటామని ప్రస్తుతం పరిస్తితి అదుపులో ఉందని తెలిపారు. అందరూ శాంతి యుతముగా ఉండాలని పోలీసు శాఖకు సహకరించాలని చిన్నారి / బాధితురాలు ఆరోగ్యముగానే ఉందని ఎలాంటి అపోహలు నమ్మవద్దని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధముగా ఎవరైనా రెచ్చగొట్టే ప్రసంగాలు, వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు.