నిజామాబాద్, సెప్టెంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో మంచినీటి సరఫరాకు సంబందించిన నాలుగు అంశాలపై గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయని ఆ శాఖ ఈ.ఈ కె.రాకేష్ తెలిపారు. కోటగిరి, సిరికొండ, నందిపేట, భీంగల్ మండలాల్లో ఇప్పటికే శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అక్టోబర్ 23వ తేదీ వరకు శిక్షణ తరగతులు కొనసాగేలా ప్రణాళిక రూపొందించామని అన్నారు.
ప్రతీ గ్రామ పంచాయతీ నుండి ఒక వ్యక్తికి మండల స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. చేతి పంపుల మరమ్మతులు, పైపులైను లీకేజీలు అరికట్టడం, పంపుసెట్లు, ప్యానల్ బోర్డుల నిర్వహణ, నీటి నాణ్యత పరీక్షలపై అవగాహన కల్పిచడం జరుగుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా మంచినీటి సరఫరాను మెరుగుపరుస్తూ, ఎక్కడ కూడా నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.