కామారెడ్డి, సెప్టెంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అత్యవసరంగా సింగరాయపల్లి గ్రామానికి చెందిన చెన్నం లింగారెడ్డికి ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో మిరుదొడ్డి శ్రీనివాస్ మానవతా దృక్పథంతో స్పందించి కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలతోని,డెంగ్యూ వ్యాధితో చాలామంది వివిధ వైద్యశాలలు చికిత్స పొందుతున్నారని వారికి కావలసిన ప్లేట్ లెట్స్ ను,రక్తాన్ని అందజేయడానికి రక్తదాతలు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని సకాలంలో ప్లేట్ లెట్స్‌ను అందజేసినప్పుడే ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడం జరుగుతుందన్నారు. రక్తదాతకు ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్న అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సింగరాయపల్లి గ్రామానికి చెందిన అంకం బాలకిషన్ పాల్గొన్నారు.