నిజామాబాద్, సెప్టెంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ (దిశా) కమిటీ సమావేశం ఈ నెల 28న (శనివారం) సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో ఉదయం 10.30 గంటలకు జరుగుతుందని డీఆర్డీఓ సాయాగౌడ్ తెలిపారు.
నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వివిధ పనుల కోసం ఆయా శాఖలకు కేటాయించిన నిధులు, వాటి వినియోగంపై సమీక్ష నిర్వహిస్తారని అన్నారు. కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని డీఆర్డీఓ కోరారు.