కామారెడ్డి, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
లింగన్నపేట్ గ్రామాన్ని ఆదర్శవంతంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజున లింగంపెట్ నాగన్న బావి వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లింగంపేట్ లోని నాగన్న బావి వలన పర్యాటక ప్రాంతంగా పరిగణించుకోవచ్చని అన్నారు.
భవిష్యత్తు తరాల వారికి నాటి కట్టడాలను చూపించ వచ్చని తెలిపారు. ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి పరచడానికి స్థానిక. మహిళా సంఘాల వారు బాధ్యతగా నిర్వహణ చేయవచ్చని సూచించారు. రెస్టారెంట్, హోటల్ వంటివి ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పండుగల సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలను కలెక్టర్ పంపిణీ చేసారు. తొలుత మహిళా సమాఖ్య సభ్యులు తయారు చేసిన పిండి వంటలను కలెక్టర్ పరిశీలించి రుచి చూశారు.
కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పరిషత్ సి.ఈ. ఒ. చందర్ నాయక్, మండల అధికారులు, విద్యార్థులు, ఉపాద్యాయులు, గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.