బాన్సువాడ, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మండలంలోని బొర్లం శివారులో బోర్లం గ్రామ పంచాయతీ నుండి అనుమతులు తీసుకొని బాన్సువాడ శివారులో భవనం నిర్మించి కళాశాల నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం బిజెపి నాయకులు సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ మున్సిపాలిటీకి సంబంధించిన రికార్డులలో భవనం లేదని సమాచార హక్కు చట్టం ద్వారా సమాధానం ఇచ్చారని, రికార్డులలో భవనం లేనప్పుడు ఇంటి నెంబర్ ఇచ్చి ఎలా టాక్స్ వసూలు చేస్తున్నారో సంబంధిత అధికారులు తెలపాలన్నారు.
గ్రామపంచాయతీలో ఒక ఇంటి నెంబర్ తీసుకుని, మున్సిపాలిటీలో ఒక ఇంటి నెంబర్ తీసుకొని అటు గ్రామపంచాయతీకి మున్సిపాలిటీకి ఇంటి పన్నును ఏగవేస్తురన్నారు. భవన నిర్మాణం అయిన నాటి నుండి ఇప్పటివరకు ఒకే సంవత్సరం ఇంటి పన్నులు వసూలు చేసి సంబంధిత అధికారులు చేతులు దులుపుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు తుప్తి ప్రసాద్, సీనియర్ నాయకులు కోణాల గంగారెడ్డి, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.