అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి

కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై ఎజెండా అంశాల వారీగా సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఎనలేని తాత్సారం జరుగుతోందని అన్నారు. మాక్లూర్‌ మండలం అడవిమామిడిపల్లి వద్ద రోడ్డు నిర్మాణంతో పాటు ఆయా చోట్ల రహదారుల నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయని అన్నారు. ఈ పెండిరగ్‌ పనుల విషయమై చర్చించేందుకు అక్టోబర్‌ రెండవ వారంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత శాఖల అధికారులందరూ ఈ సమావేశానికి హాజరయ్యేలా చూడాలన్నారు. సకాలంలో పనులు పూర్తయి ప్రజలకు వసతులు అందుబాటులోకి వచ్చేలా అధికారులు చొరవ చూపాలని హితవు పలికారు. వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన ఆయా పనులు ఏ దశల్లో కొనసాగుతున్నాయి, వెచ్చించిన నిధుల వివరాలను తెలుపుతూ సమగ్ర నివేదికలు తనకు సమర్పించాలని ఆర్‌ అండ్‌ బి, పంచాయతీరాజ్‌, జాతీయ రహదారులు, ఫారెస్ట్‌ తదితర శాఖల అధికారులను ఆదేశించారు.

విద్యాశాఖకు సంబంధించి కేంద్రం ద్వారా మంజూరైన నిధుల గురించి ఎం.పీ ప్రశ్నించగా, పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో 40 పాఠశాలలకు కేంద్రం ద్వారా రూ. 20 కోట్ల నిధులు మంజూరయ్యాయని, వాటిని అదనపు తరగతి గదుల నిర్మాణాలు, లైబ్రరీలు, ప్రయోగశాలలు, క్రీడా పరికరాలు, మైదానాల అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నామని డీఈఓ దుర్గాప్రసాద్‌ తెలిపారు. అదేవిధంగా అమృత్‌ పథకం కింద జిల్లాలోని నిజామాబాద్‌ నగర పాలక సంస్థతో పాటు బోధన్‌, ఆర్మూర్‌, భీంగల్‌ మున్సిపాలిటీలకు రూ. 335 కోట్ల నిధులు మంజూరయ్యాయని ప్రజారోగ్య శాఖ ఈ.ఈ తిరుపతికుమార్‌ ఎం.పీ దృష్టికి తెచ్చారు.

ఈ నిధులతో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింతగా మెరుగుపరుస్తున్నామని, భూగర్భ డ్రైనేజీ పెండిరగ్‌ పనుల పూర్తికి కూడా అమృత్‌ పథకం నిధులను వెచ్చిస్తున్నామని అన్నారు. అటవీ శాఖకు ‘కాంపా’ పథకం ద్వారా మంజూరైన నిధులను సక్రమంగా వెచ్చిస్తూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఎం.పీ అర్వింద్‌ ఫారెస్ట్‌ అధికారులకు సూచించారు. పీ.ఎం విశ్వకర్మ పథకం అమలు తీరు గురించి ఎం.పీ ఆరా తీయగా, జిల్లాలో 23583 మంది దరఖాస్తులు చేసుకున్నారని, నల్గొండ తరువాత నిజామాబాద్‌ జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉందని పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. ఇప్పటివరకు 2592 మందికి శిక్షణ కూడా పూర్తి చేశామని వివరించారు.

కాగా, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఎమ్మెల్యేలు ధన్పాల్‌ సూర్యనారాయణ, పైడి రాకేష్‌ రెడ్డి సమావేశంలో ఆక్షేపణ తెలిపారు. దీనిపై ఎం.పీ స్పందిస్తూ, ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరుగకుండా అధికారులు సంబంధిత ఎం.పీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు తప్పనిసరి ముందస్తుగానే తగిన సమాచారం అందించాలని అన్నారు. ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

ఆర్‌ అండ్‌ బీ చీఫ్‌ ఇంజనీర్‌ కు సన్మానం

సుమారు 38 సంవత్సరాల పాటు హన్మంత్‌ రావు అందించిన సేవలను కొనియాడారు. సుదీర్ఘ కాలంపాటు విధులు నిర్వర్తించిన సందర్భంగా ఎదురైన అనుభవాలను హన్మంత్‌ రావు ఈ వేదికగా పంచుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అంకిత్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ మకరంద్‌, డీఆర్డీఓ సాయాగౌడ్‌, వివిధ శాఖల అధికారులు, దిశా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »