నిజామాబాద్, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ జయంతి వేడుకలు బార్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ షహీద్ భగత్ సింగ్ 1907లో పంజాబ్ జన్మించి చిన్నతనం నుంచి స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడై బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి దేశం కోసం పోరాడి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా, ఉరితాడును ముద్దాడి నేలకొరిగిన జాతీయ విప్లవకారుడని అన్నారు.
ఆయన వీర మరణం దేశం ఎన్నటికి మరువబోదని, నేటి యువత భగత్ స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో భార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పి.రాజు, సీనియర్ న్యాయవాదులు రాజ్‌కుమార్ సుబేదార్, శ్రీహరి ఆచార్య, జె వెంకటేశ్వర్, నరేందర్ రెడ్డి, మాణిక్ రాజ్, ఉదయ్ కృష్ణ, ప్రకాష్, శ్రీమన్, శుక్కబొట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.