కామారెడ్డి, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ట్రిపుల్ ఐటీల్లో సీటు సాధించే దిశగా విద్యార్థులకు విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున బిక్నూర్ కే.జి.బి.వి. పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజన, వసతి సౌకర్యాలు, విద్యా బోధన తదితర అంశాలకు సంబంధించిన వివరాలను ప్రత్యేక అధికారిణి హరిప్రియ ను అడిగి తెలుసుకున్నారు. వంటశాల, స్టోర్ రూం లను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. ఎప్పటికప్పుడు సరుకులను పరిశీలించాలని సూచించారు.
స్టాక్ రిజిస్టర్, హాజరు రిజిస్టర్ లను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ మంచిగా చదువుకొని ఉన్నత చదువులకు వెళ్లి ఉన్నత స్థానాలను సంపాదించాలని అన్నారు. డిజిటల్ తరగతులను అభ్యసించాలని ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని అన్నారు. ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ పొందేవిధంగా మంచి ర్యాంకులు సంపాదించాలని అన్నారు. హాజరు రిజిస్టర్ లో టీచర్లు, మిగతా స్టాఫ్, ఆరోగ్య సిబ్బంది, వంట్ సిబ్బంది ప్రతి రోజూ సంతకాలు చేయాలనీ, స్పెషల్ ఆఫీసర్ రిజిస్టర్ లను పరిశీలించాలని అన్నారు. క్యాంపస్ పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.
ట్రిపుల్ ఐటీ లో అడ్మిషన్ కోసం ఇప్పటి నుండే ప్రణాలికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అనంతరం తరగతి గదులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని రజిత, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా పరిషత్ సి.ఈ. ఒ.చందర్ నాయక్, పంచాయతీ రాజ్ ఈ ఈ దుర్గ ప్రసాద్, డిప్యూటీ ఈ ఈ స్వామి దాస్, జిల్లా పశు సంవర్థక అధికారి రాజేశ్వర్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.