కామారెడ్డి, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలో నీటి సంరక్షణ, భూ గర్భ జలాలు పెంపొందించే పనులకు సంబంధించిన పూర్తి నివేదికలను క్రోడీకరించి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నీటి సంరక్షణ, భూ గర్భ జలాలు పెంచే పనులు, ప్లాంటేషన్ లకు సంబంధించినవి, పూర్తి చేయబడిన, చేయవలసిన పనులను గుర్తించి పూర్తి నివేదికలను సిద్ధం చేయాలని అన్నారు.
అక్టోబర్ 8 నుండి 10 వరకు జిల్లాలో జలశక్తి అభియాన్ కేంద్రం బృందం పర్యటించనున్న సందర్భంలో సమావేశం ఏర్పాటు చేయడమైనదనీ తెలుపుతూ, జిల్లాలోని నీటి సంరక్షణకు సంబంధించిన నివేదికలను సంబంధిత శాఖల నుండి క్రోడీకరించి సిద్ధం చేయాలని తెలిపారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పరిషత్ సీఈఓ చందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా భూగర్భ శాఖాధికారి సతీష్ , జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, మున్సిపల్ కమీషనర్ సుజాత, జిల్లా పంచాయతీ రాజ్ ఈ ఈ దుర్గా ప్రసాద్, జిల్లా ఉద్యానవన అధికారిని జ్యోతి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.