నిజామాబాద్, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ అఫ్ బార్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశమై న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని తీర్మానించారు.
అనంతరం జిల్లా కోర్టు ప్రధాన ద్వారం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో టెన్యూర్ పిపి నియామకం విడానని కొనసాగించాలని 41(ఎ) సిఆర్పిసి, 35 బిఎన్ఎస్ఎస్, సిఆర్పిసి అమెండ్మెంట్ చేయాలని వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, న్యాయవాదులు డాన్పల్, సురేష్, పిల్లి శ్రీకాంత్, ఏర్రం గణపతి, వి భాస్కర్, శ్రీధర్, విశ్వక్ సేన్, ఆశ నారాయణ, భిక్షపతి, శివాజీ భోస్లీ, సాయన్న, జైపాల్, మహిళా న్యాయవాదుల కవితారెడ్డి, అంజలి తదితరులు పాల్గొన్నారు.