ఆర్మూర్, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ పట్టణంలోని శ్రీ సరస్వతీ విద్యా మందిరు పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. పాఠశాల ఆవరణలో విద్యార్థినిలు రంగురంగుల దుస్తులు ధరించి బతుకమ్మ, డీజే పాటలకు నృత్యాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిభంభించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్ ముద్రకోలా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర సంప్రదాయాన్ని గౌరవిస్తూ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. కులమతాలకతీతంగా బతుకమ్మ వేడుకలను పాఠశాలలో నిర్వహించుకోవడం జరిగిందని, విద్యార్థులకు అన్ని పండుగల పైన అవగాహన కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు.
ఆర్మూరు పట్టణ ప్రజలందరికీ ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ భాను తేజ, అభిమన్యు, మాతాజీలు సోనాలి, శైలజ ముద్రకోల, శ్రీ విద్యా, మంజుల, స్వరూప, లత, సిందుజా, వేద, అంజలి, ప్రియాంక, శైలజ, విద్యార్థులు పాల్గొన్నారు.