కామారెడ్డి, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వృద్దులు ఆరోగ్యవంతంగా ఉంటూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. అంతర్జాతీయ వయో వృద్దుల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని వయో వృద్ధుల ఫోరం భవనంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వృద్దులు ఆరోగ్యవంతంగా ఉండాలని, తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వారం రోజుల పాటు అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాలను నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. తల్లి దండ్రులను సరిగా చూడని వారికి చట్టం అండగా నిలుస్తుందని తెలిపారు. తల్లిదండ్రులను పోషించనీ వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.
వృద్దులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. యోగ కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రతీ రోజూ నడక, వ్యాయామం చేయాలని తద్వారా ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ మాట్లాడుతూ, వృద్దులు తమ మనుమలు, మనుమరాళ్ళతో కాలక్షేపం చేయాలని సూచించారు.
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారి బాబయ్య మాట్లాడుతూ, వయోవృద్దులను చిన్న పిల్లల్లా చీసుకోవాలనీ, ఆప్యాయంగా పలకరించాలని అన్నారు. వృద్ధులను గౌరవించిక్షోవాలనై అన్నారు. నిరాదరణకు గురి అయిన వృద్దులకు చట్టం అండగా నిలుస్తుంది తెలిపారు. యోగ, వాకింగ్, క్యారం వంటి పోటీలను ఈ సందర్భంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.
అనంతరం పలువురు వృద్ధులను శాలువాలతో సత్కరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి కలెక్టర్ మెమొంటోలు అందజేశారు. వృద్ధుల సంక్షేమ ఫోరం ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో వృద్ధుల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.