కామారెడ్డి, అక్టోబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తేదీ 29. 03. 2021 నాడు వడ్డే నాగవ్వ భర్త నాగయ్య వయసు : 48 సంవత్సరాలు, కులం : వడ్డెర, వృత్తి: కూలీ, పెద్ద కొడంగల్ గ్రామం మృతురాలు తన కొడుకు మద్యానికి బానిసై తరచూ తల్లి దగ్గర ఉన్న పైసలు తీసుకొని తల్లిని ఇబ్బంది పెడుతుండేవాడు. 29.03.2021 రాత్రి 10:30 కు నేను ఇంట్లో ఉండగా మా ఇంటి వెనకాల వడ్డే నాగవ ఇంటిదగ్గర గొడవ జరుగుతుందని వెళ్లి చూడగా వడ్డే నాగవ కుమారుడైన వడ్డే నర్సింలు తల్లితో పైసలు విషయంలో గొడవపడి పైసలు ఇవ్వక పోగా పక్కనే ఉన్న ఒక కర్రతో ఆమె ముఖం పైన, తల పైన కొట్టగా ఆమె అక్కడే పడిపోయినది, ఎవరైనా దగ్గరకొస్తే మిమ్మల్ని కూడా చంపుతా అని బెదిరించినాడు అని 31.03.2021 వడ్డే నాగవ్వ ఇంటి ముందున్న గోరుగంటి అనిల్ ఇచ్చిన ఫిర్యాది మేరకు పెద్ద కొడంగల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
పరిశోధనలో భాగంగా మృతురాలి ఇంటి ప్రక్కన, గ్రామస్తులను, ఇతర గ్రామస్తులను విచారించి వడ్డే నర్సింలును నేరస్తునిగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు.
ఈ విషయములో నేరస్తుడిపై కోర్టు యందు అభియోగ పత్రం వేయడం జరిగింది. కేసులో సాక్షులను విచారించి, సాక్షాదారాలను పరిశీలించి కేసు రుజువు కావడం జరిగినదని న్యాయమూర్తి కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ నిందితునికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 5000 జరిమాన విధిస్తూ తీర్పు ఇచ్చారు.
పోలీసు తరపున వాదనలు వినిపించిన పీపీ టి. రాజగోపాల్ గౌడ్, ఈ కేసును సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేకర్, యస్ ఐ విజయ్ కొండా, ప్రస్తుత బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమారు, యస్‌ఐ మహేందర్. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్సై మురళి, సిడివో మురళీకృష్ణ, విక్రమరెడ్డి లను జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందించారు.