నిజామాబాద్, అక్టోబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మహాత్మాగాంధీ అడుగు జాడల్లో యువత, విద్యార్థులు నడవాలని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ విగ్రహానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, సిబిసి ఎఫ్ పిఓ బి.ధర్మ నాయక్, జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్, అధ్యాపకులు కలసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… స్వాతంత్య్ర సాధనలో గాంధీ పాత్ర మరువలేనిదన్నారు. దేశ ప్రజలకే కాక ప్రపంచ వ్యాప్తంగా ఆయన స్ఫూర్తి ప్రధాత అన్నారు. మహాత్మా గాంధీ సుదీర్ఘ పోరాటంతోనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని, ఆయన త్యాగాలు చిరస్మరణీయమన్నారు. ప్రతీ ఒక్కరు ఆ మహనీయుడి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. అలాగే మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
అనంతరం గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఎన్ ఎస్ ఎస్, సీబీసీ మరియు నెహ్రూ యువ కేంద్రం, కళాశాల ఆధ్వర్యంలో ‘‘స్వచ్ఛత హి సేవా’’ శ్రమదానం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు.
సఫాయి (పారిశుద్ధ్య) కార్మికులకు సన్మానం
గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సఫాయి (పారిశుద్ధ్య) కార్మికుల సేవలను కొనియాడుతూ ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో వారు చేస్తున్న సేవలకు గుర్తింపుగా సత్కారం చేశారు.
దుబ్బ ఏరియాలో జూట్ బ్యాగులు పంపిణీ
ఎన్‌ఎస్‌ఎస్ మరియు కళాశాల ఆధ్వర్యంలో దుబ్బ ఏరియాలో జూట్ బ్యాగులు ఉంచితంగా పంపిణీ చేశారు.
కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్, వైస్ ప్రిన్సిపాల్ అబ్దుల్ రఫీక్, రంగరత్నం ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా.ఈ.వెంకట రమణ, జి. నాగ జ్యోతి, జి. సుధాకర్ రావు, ఎం.నరేష్, ఎం.దస్తప్ప, ఎం.రజిత, ఎన్ సిసి అధికారులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలింటర్లు, తదితరులు పాల్గొన్నారు.