బాన్సువాడ, అక్టోబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇంటింటి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం రోజున కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని వార్డ్ నెంబర్ 6 లో కుటుంబ సర్వే పనులను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ క్రింద చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా పూర్తి సమాచారంతో నిర్వహించాలని అన్నారు. జిల్లాలోని మున్సిపల్, గ్రామాలలో పైలెట్ ప్రాజెక్ట్ క్రింద ఎంపిక చేసిన గ్రామాలలో సర్వే పనులు టీమ్‌ల ద్వారా ఈ నెల 7 వరకు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, మున్సిపల్ కమీషనర్ సుజాత, టీమ్ సభ్యులు పాల్గొన్నారు.