అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌ల ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసులలో పురోగతి, ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు.

గ్రామాల అభివృద్ధి కోసం వీడీసీలు కృషి చేయాలని, ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని చైర్మన్‌ సూచించారు. ఎస్సీ, ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసే గ్రామాభివృద్ధి కమిటీలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ చైర్మన్‌ వెంకటయ్య కలెక్టర్‌, సీ.పీలకు సూచించారు. పోలీస్‌ స్టేషన్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం పక్కాగా అమలు జరిగేలా చూడాలని, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా రెవెన్యూ, పోలీసు అధికారులు, సిబ్బంది పని చేయాలని హితవు పలికారు.

ఎస్సీ, ఎస్టీలను వేధింపులకు గురి చేసే అధికారులపై కమిషన్‌ కఠిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీలకు సమస్యలు ఎదురైతే అక్కడికి కమిషన్‌ వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తోందని తెలిపారు.

ప్రతీ నెల చివరి వారంలో సివిల్‌ రైట్స్‌ డే, ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించాలని అన్నారు. కాగా, జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌ చక్కగా పని చేస్తున్నారని జిల్లా ప్రజలలో మంచి పేరు వినిపిస్తోందని ఈ సందర్భంగా చైర్మన్‌ వారిని అభినందించారు. అట్రాసిటీ కేసులకు సంబంధించి 41 సీఆర్పీసీ కింద పోలీస్‌ స్టేషన్లకు పిలిపించుకుని స్టేషన్‌ బెయిల్‌ ఇస్తుండడం వల్ల అట్రాసిటీ చట్టం నీరుగారిపోయే ప్రమాదం నెలకొందని చైర్మన్‌ అభిప్రాయపడ్డారు.

ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రితో చేర్చామని, ఈ నెలాఖరులో ఢల్లీికి వెళ్లి కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని, న్యాయశాఖ మంత్రిని కలిసి విన్నవించనున్నామని వెల్లడిరచారు.

Check Also

రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »