కామారెడ్డి, అక్టోబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న రాజేష్కు అత్యవసరంగా బి పాజిటివ్ ప్లేట్లెట్స్ అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. సింగరాయపల్లి గ్రామానికి చెందిన అంకం బాలకిషన్ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ప్లేట్ లెట్స్‌ను కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల నుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం అత్యవసర పరిస్థితులు ఉన్న వారికి కావలసిన ప్లేట్ లెట్స్ ను అందజేస్తూ మానవత్వాన్ని చాటుతున్న రక్తదాత బాలకిషన్ ఐవి ఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు రాజన్నల తరఫున అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడాలని తోటి వారి ప్రాణాలను కాపాడడానికి రక్తదానం చేయడానికి రక్తదాతలు ముందుకు రావాలన్నారు సకాలంలో రక్తాన్ని అందజేయకపోతే ప్రాణాలు పోయే పరిస్థితులు వస్తాయని అన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు జమీల్, నిర్వాహకులు జీవన్, వెంకటేష్ పాల్గొన్నారు.